షవర్ బాత్ చేసిన గణేష్ మహరాజ్.

0
75

హైదరాబాద్ జిల్లా. సికింద్రాబాద్ :  గణేష్ మహారాజ్ షవర్ బాత్ చేయడమేంటి అని ఆశ్చర్య పోతున్నారా? మీరు విన్నది నిజమే. ఈ ఘటనకు సికింద్రాబాద్ నెలవయ్యింది. వివరాలలోకి వెళితే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చే బాధ్యతల్లో ఉన్న జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఆచరణలో కూడా చూపించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ యూనియన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడ్ని నెలకొల్పి వారం రోజుల పాటు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. కార్యాలయం ఆవరణలోనే కృత్రిమ కొలను, షవర్ ను ఏర్పాటు చేసి అందులోనే ఎటువంటి హంగు ఆర్భాటాలు, డీజేలు, బ్యాండ్ మోతలు లేకుండా నిరాడంబరంగా ఆనందోత్సాహాలతో నిమజ్జనం చేశారు. గణపతి మహారాజ్ కృత్రిమ కొలనులోనే షవర్ బాత్ చేస్తూ అందులో కరిగి పోతుండగా మహిళా ఉద్యోగులు, కార్మికులు కోలాటాలు ఆడుతూ వీడ్కోలు పలికారు.

      Sidhumaroju 

Search
Categories
Read More
Music
Neeti Mohan, Jonita Gandhi, Sukhwinder Singh to Join AR Rahman’s Upcoming Mumbai Concert
Neeti Mohan, Jonita Gandhi, Sukhwinder Singh to Join AR Rahman’s Upcoming Mumbai Concert...
By BMA ADMIN 2025-05-22 17:45:16 0 2K
Telangana
అల్వాల్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి : మల్కాజిగిరి ఎమ్మెల్యే
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ని...
By Sidhu Maroju 2025-06-10 10:34:52 0 1K
Telangana
మా సమస్యలను పరిష్కరించండి: అల్వాల్ జొన్నబండ నివాసులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్ జొన్న బండ నివాసులు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి...
By Sidhu Maroju 2025-06-29 12:42:09 0 946
Karnataka
Bengaluru Sees Sharp Rise in Human Rights Complaints
Banagalore- Karnataka - In the last two years, Bengaluru Urban has recorded a staggering 3,537...
By Citizen Rights Council 2025-08-11 10:43:05 0 741
Sikkim
Sikkim to Charge ₹50 Entry Fee for Tourists from March 2025
The Sikkim government has introduced a mandatory ₹50 entry fee for tourists from March 2025 (with...
By Bharat Aawaz 2025-07-17 07:27:42 0 818
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com