అస్తమించిన గిరిజన సూర్యుడు EX -CM శిబుసోరన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క

0
58

హైదరాబాద్/ హైదరాబాద్.

 

ఝార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్  మృతిపట్ల తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా, సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క  సంతాపం వ్యక్తం చేశారు. తదనంతరం మంత్రి సీతక్క  మాట్లాడుతూ... శిబూ సోరెన్  ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకుడిగా.., ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేశారన్నారు. ముఖ్యంగా ఆయన గిరిజన సంఘాల హక్కుల కోసం, ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా ప్రసిద్ధి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదివాసీ హక్కుల కోసం ఆయ‌న సాగించిన పోరాటం భారతదేశ సామాజిక రాజకీయ చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోతుందన్నారు. ఆదివాసీ హక్కుల కోసం నిరంతరంగా పోరాడిన ఆయన జీవితమే ఒక సందేశమని కొనియాడారు. దేశానికి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి గురూజీ మృతి తీరని లోటుగా పేర్కొన్నారు. శిబు సోరెన్ చూపిన మార్గం ఈనాటి తరాలకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు.ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మంత్రి సీతక్క తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

-సిద్దుమారోజు 

Search
Categories
Read More
Telangana
Heartfelt Congratulations!
Proud moment as Padmini has secured an impressive Rank 4191 in TG LAWCET 2025 (LL.B. 5 Years)...
By Sidhu Maroju 2025-06-26 11:15:39 1 1K
Andhra Pradesh
రేషన్ డీలర్లు సరిగ్గా స్పందించకపోతే ఫిర్యాదు చేయండి.. కర్నూలు జేసీ డాక్టర్ నవ్య..
రేషన్ డీలర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు: కర్నూలు JC   రేషన్ సరుకుల పంపిణీ విధానంలో రేషన్...
By mahaboob basha 2025-06-01 05:23:46 0 1K
Andhra Pradesh
పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం
చనుగొండ్ల గ్రామానికి చెందిన బోయ ప్రసాద్(27) గత పది రోజుల క్రితం కోడుమూరు పరిధిలో పురుగుల మందు...
By mahaboob basha 2025-07-21 14:59:25 1 307
BMA
📰 Fourth Estate (Media) with Purpose: Redefining the Role of Fourth Estate (Media) in the Digital Age
📰 Fourth Estate (Media) with Purpose: Redefining the Role of Fourth Estate (Media) in the Digital...
By BMA (Bharat Media Association) 2025-05-03 18:02:50 0 2K
Bharat Aawaz
Journalism Rights in India – A Fight for Truth, Then and Now
Journalism in India didn’t begin in newsrooms. It began as a fight a voice raised against...
By Media Facts & History 2025-06-30 09:25:46 0 870
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com