అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నా :సిపిఎం

1
134

అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నా :సిపిఎం 

 ఆత్మకూరు : అర్హులైన పేదలందరికీ కూటమి ప్రభుత్వం రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ స్థలాల్లో కాపురం ఉన్న పేదలందరికీ 30 జీఓ ప్రకారం పట్టాలి ఇవ్వాలని సిపిఎం పార్టీ పట్టణ కమిటీకార్యదర్శి ఏ. రణధీర్, నాయకులు పి మా భాష, జి నాగేశ్వరరావు, కోరారు..

 సోమవారం పట్టణంలోని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పక్కా గృహాలు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, గత అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్థలాల్లో కాపురం పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని స్థానిక సిపిఎం కార్యాలయం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంపీడీవో కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా జరిగిన సభకు సిపిఎం పార్టీ పట్టణ నాయకులు డి రామ్ నాయక్ అధ్యక్షతన వహించారు ఏ. రణధీర్ మాట్లాడుతూ పేదలకు సెంట్ న్నారా ఇస్తామంటున్నారు గతంలో మూడు సెంట్లు ఇచ్చారు ఇప్పుడు రెండు సెంట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కొనకుండా గత ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాలు ఇచ్చారని, దాంట్లో కూడా అనేక మందికి తొలగించారన్నారు.మేము అధికారంలోకి వస్తే పట్టణాలలోని పేదలందరికీ రెండు సెంట్లు స్థలం, గ్రామాలలో మూడు సెంట్లు స్థలం కేటాయించి తమ ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేర్చాలని అన్నారు. అలాగే 2001 2003లో ఇచ్చిన పటాదారులకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలలో కూడా చాలామంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా పట్టాలు రద్దు చేశారని అలాగే జగనన్న కాలనీలలో స్థలాలు వచ్చిన పేదలు వేల రూపాయలు ఖర్చు చేసుకొని ఇల్లు నిర్మించుకుంటే హైవేలో మీ స్థలాలు పోయాయి మీకు కొత్త స్థలాలు ఇస్తామన్నారు కానీ ఆ స్థలాలు నేటికీ ఇవ్వలేదన్నారు. 2001 23లో పట్టాలు వచ్చి నేటి వరకు స్థలాలు రానివారికి అలాగే అర్హులైన పేదలందరికీ జగనన్న కాలనీలలో హైవేలో స్థలాలు పోయిన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, అర్హులైన పేదలందరికీ పెన్షన్స్ ఇవ్వాలని, పట్టణంలో ప్రభుత్వ స్థలాల్లో గత అనేక సంవత్సరాల నుంచి కొట్టాలు వేసుకొని కాపురమున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రత్న రాధిక గారు మాట్లాడుతూ సర్వే చేయించి ఇళ్లస్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో సిపిఎం పార్టీ పట్టణ ఏ. సురేంద్ర, వీరన్న, షైక్ ఇస్మాయిల్, చందా వారి వెంకటేశ్వర్లు, బిఎస్ వలి , ఏ. కిరణ్, పాల శివుడు,మహమ్మద్,గణపతి, నబి,మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

Like
2
Search
Categories
Read More
Delhi - NCR
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament Parliamentary Affairs...
By Bharat Aawaz 2025-07-17 08:30:37 0 227
Andhra Pradesh
కోడుమూరు మండలం వర్కూరు గ్రామంలో సిపిఐ మహాసభను ఘనంగా
మహాసభ జెండాను, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి నాయకులు,, బి కృష్ణ...
By mahaboob basha 2025-06-13 11:55:32 0 684
BMA
Why Join Bharat Media Association (BMA)? 🚀
Why Join Bharat Media Association (BMA)? 🚀 Bharat Media Association (BMA) isn’t just...
By BMA (Bharat Media Association) 2025-04-27 18:39:42 0 1K
Bharat Aawaz
A Mission of Science and Symbolism
Shubhanshu Shukla- India’s New Star in Space Returns Home Safely A Historic Moment for...
By Bharat Aawaz 2025-07-16 04:57:13 0 215
Telangana
ఐపీఎల్ -2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు
18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ. ఉత్కంఠభరితంగా సాగిన...
By Sidhu Maroju 2025-06-03 18:28:25 0 837
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com