ఆరోగ్య బాగుకై అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తుదారులకు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేయించిన 4.30 లక్షల రూపాయల విలువ గల మూడు ఎల్వోసీ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా 125 - గాజుల రామారం డివిజన్ ఇందిరా నగర్ - బి ప్రాంతానికి చెందిన ఎన్.అర్జున్ కేరాఫ్ విజయ్ కుమార్ (24), 132 - జీడిమెట్ల డివిజన్ వినాయక్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి పలివన్ అజీజ్ తండ్రి పలివన్ ఇస్మాయిల్ (3), దుండిగల్ మున్సిపాలిటీ పరిధి దుండిగల్ వార్డుకు చెందిన తిలక్ జ్యోతి తండ్రి టి. అశోక్ (30) ల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు వైద్య నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధులను మంజూరు చేయించి లబ్ధిత కుటుంబ సభ్యులకు ఎల్వోసీ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... ఆరోగ్య బాగుకై అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకొని మెరుగైన వైద్యాన్ని పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో గాజుల రామారం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, నదీమ్ రాయ్, ఇబ్రహీం బేగ్, అడ్వకేట్ కమలాకర్, మూసా ఖాన్, బోయిని మహేష్, సంధ్యా రెడ్డి, శ్రీదేవి రెడ్డి, యాదగిరి, జునైద్ తదితరులు పాల్గొన్నారు.
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy