రాజీవ్ యువ వికాసంతో యువతకు ఉపాధి

0
1K

రాజీవ్ యువ వికాసం నిరుద్యోగుల ఉపాధికి ఊతం. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డాక ప‌దేండ్ల‌లో గ‌త బీఆర్ఎస్ స‌ర్కారు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇవ్వ‌లేదు. ఏడాదికి ఒక‌టో.. రెండో ఇచ్చినా.. అందులో కొన్ని పేప‌ర్‌లీక్స్‌తో వాయిదాప‌డుతూ వ‌చ్చాయి. దీంతో ప్ర‌త్యేక రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశ‌లు అడియాశ‌లే అయ్యాయి. మ‌రోవైపు నిరుద్యోగుల‌కు ఉపాధి తోవ చూపేందుకు గ‌త బీఆర్ఎస్ స‌ర్కారు కార్పొరేష‌న్ రుణాల‌ను కూడా ఇవ్వ‌లేదు. అటు ఉద్యోగాలు లేక‌.. ఇటు ఉపాధి లేక నిరుద్యోగుల జీవితాలు నీరుగారిపోయాయి. 2023 డిసెంబ‌ర్‌లో రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కంక‌ణం క‌ట్టుకున్న‌ది. ఓవైపు ప్ర‌భుత్వ ఉద్యోగాలను చ‌క‌చ‌కా భ‌ర్తీ చేస్తూనే.. మ‌రోవైపు నిరుద్యోగుల‌కు ఉపాధి తోవ చూపేందుకు రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వెనుకబడిన వర్గాల యువతకు ఆర్థిక సహాయం అందించాల‌ని స‌ర్కారు ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. గ‌తానికి భిన్నం రూ. 50 వేల నుంచి రూ. 4ల‌క్ష‌ల వ‌ర‌కు సాయం అందించేందుకు నిర్ణ‌యించింది. నిరుద్యోగుల‌పై భారం లేకుండా గతంలో ఉన్న స‌బ్సిడీని రివ‌ర్స్ చేసి.. 70 శాతం ప్ర‌భుత్వం, 30 శాతం ల‌బ్ధిదారుడు భ‌రించేలా విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. రాజీవ్ యువ వికాసం పథకం కింద 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. 8,000 కోట్లు కేటాయించింది. నిరుద్యోగుల‌నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. కాంగ్రెస్ కార్య‌క‌ర్త అయినా స‌రే.. అర్హ‌త ఉంటేనే సాయం అందించాల‌ని గౌర‌వ సీఎం శ్రీ రేవంత్‌రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు అప్లికేష‌న్ల‌ను క్షుణ్నంగా వ‌డ‌పోసి.. అర్హుల‌కే రాజీవ్ యువ వికాసం సాయం అందేలా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ సాయంతో నిరుద్యోగ యువ‌త త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డి అటు త‌న కుటంబానికి, ఇటు రాష్ట్రానికి వెన్నుద‌న్నుగా నిలిచేలా తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కారు అడుగులు వేస్తున్న‌ది. రాజీవ్ యువ వికాసం స్కీమ్‌తో 5 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు వ్యాపార‌స్తులుగా మారితే రాష్ట్ర జీడీపీ కూడా గ‌ణ‌నీయంగా పెరుగ‌నున్న‌ది. గౌర‌వ సీఎం రేవంత్‌రెడ్డిగారి 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీకి ఈ స్కీమ్ ఊతంగా నిలువ‌నున్న‌ది.

Search
Categories
Read More
Telangana
బస్తీ వాసులకు అండగా జీడి సంపత్ కుమార్ గౌడ్
మల్కాజిగిరి ముస్లిం బస్తివాసులు తమ బస్తి లో ప్రధానంగా నాలుగు సమస్యలు చాలా రోజులుగా...
By Vadla Egonda 2025-07-13 06:44:20 0 367
Media Academy
2. Powerful Writing: Turning Facts into Impactful Stories
2. Powerful Writing: Turning Facts into Impactful Stories Words are your tools. Writing in...
By Media Academy 2025-04-29 05:14:40 0 1K
Bharat Aawaz
Threads of Freedom: A Story of India's Flag. ***
  స్వాతంత్య్రానికి చాలా కాలం ముందే ఈ ప్రయాణం ప్రారంభమైంది. 1906లో, కలకత్తాలో ఎరుపు,...
By Bharat Aawaz 2025-07-22 06:25:37 0 121
Telangana
ఫోన్ ట్యాపింగ్ ఎట్ మల్కాజ్గిరి కాంగ్రెస్ లీడర్స్
*ఫోన్ ట్యాపింగ్ @ మల్కాజిగిరి లీడర్స్. *మల్కాజ్గిరి ని వదలని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.మైనంపల్లి...
By Vadla Egonda 2025-06-18 19:57:24 0 664
BMA
Subscription-Based Membership Perks: Unlock Exclusive Opportunities
Subscription-Based Membership Perks: Unlock Exclusive Opportunities At Bharat Media Association...
By BMA (Bharat Media Association) 2025-04-27 17:14:28 0 1K
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com