ఏర చెరువు, గ్రౌండ్ పనులు పరిశీలించిన MAL గణబాబు.
Posted 2026-09-12 09:11:29
0
241
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 89వ వార్డు అప్పల నరసింహ కాలనీలో ఏర చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు పరిశీలించారు.
ఈ సందర్భంగా చెరువు వద్ద చేపడుతున్న పనుల పురోగతిని అధికారులను, సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు ఉపయోగకరంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని శ్రీ గణబాబు గారు తెలిపారు.
Search
Categories
- Legal
- Sadhana
- Bharat
- International
- SURAKSHA
- Technology
- Sports
- Prop News
- Music
- Life Style
- Health & Fitness
- Fashion & Beauty
- Entertainment
- Business & Finance
- BMA
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Justice for Every Indian – A Call We Can’t Ignore
Fake Encounter or Miscarriage of Justice in Punjab?
Two young men, Jaspreet Singh and Ram...
For the Voices That Keep Us Informed
To every journalist, reporter, and anchor who risks it all to bring the truth to light—you...
Your Right, Their Wrong: Why Every Citizen Must Rise Today
In a country where the Constitution promises justice, liberty, and dignity, a heartbreaking...