BMA | Bharat Media Association

Search

Discover new people, create new connections and make new friends

  • *నందిగుంట 4వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా ఎస్.కె. నన్నేష్*

    *నందిగుంట, నవంబర్ 27:* ఉదయగిరి నియోజకవర్గం, నందిగుంట గ్రామ పంచాయతీ 4వ వార్డు నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎస్.కె. నన్నేష్ బరిలోకి దిగారు.

    ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రచారం నిర్వహించి, ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. "ప్రజల సేవే నా లక్ష్యం" అని ఆయన అన్నారు. వార్డులో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

    టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    16 Views
  • 🔸వింజమూరు మండలం బుక్కాపురం సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విస్తృత ఎన్నికల ప్రచారం..!
    🔹 బుక్కాపురం అభివృద్ధికి కూటమి అభ్యర్థుల విజయమే కీలకం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! వింజమూరు మండలం, బుక్కాపురం సెగ్మెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు విస్తృతంగా పర్యటించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రజల మద్దతు కోరారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ.. బుక్కాపురం సెగ్మెంట్...
    576 Views
  • 🔸వింజమూరు మండలం ఊటుకూరు సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విస్తృత ఎన్నికల ప్రచారం..!
    🔹ఊటుకూరు అభివృద్ధికి కూటమి అభ్యర్థుల విజయమే కీలకం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!   వింజమూరు మండలం, ఊటుకూరు సెగ్మెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు విస్తృతంగా పర్యటించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రజల మద్దతు కోరారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ.. ఊటుకూరు సెగ్మెంట్...
    524 Views
  • ఉదయగిరి నియోజకవర్గంలో కూటమి జెండా ఎగరడం ఖాయం.. గెలుపుపై ఎలాంటి సందేహం లేదు..!!

    రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు పిలుపునిచ్చారు.

    ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని 83 ఎంపీటీసీ స్థానాలు, 8 జడ్పీటీసీ స్థానాలు, 143 గ్రామ పంచాయతీల్లో కూటమి ఘన విజయం సాధించబోతోందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులు, నాయకులు మరియు కార్యకర్తల ఐక్యత, సమష్టి కృషితో ప్రతి పంచాయతీ, ప్రతి వార్డు, ప్రతి స్థానంలో కూటమి జెండా ఎగరడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

    ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, ప్రజలే తమ ఓటు ద్వారా విజేతలను నిర్ణయిస్తారని పేర్కొన్నారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని, అవసరమైన చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

    ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ.. ప్రజల విశ్వాసంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు స్పష్టం చేశారు.
    300 Views
  • 🔸స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కొండాపురం మండల నాయకులతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సన్నాహక సమావేశం..!
    🔹కూటమి విజయమే లక్ష్యం.. నాయకులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిశానిర్దేశం..!   స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వింజమూరు మండలం బొమ్మరాజుచెరువు లోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో కొండాపురం మండల ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలు,...
    602 Views
  • 🔹జిర్రావారిపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్ – ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
    కలిగిరి మండలం, కలిగిరి గ్రామపంచాయతీ పరిధిలోని జిర్రావారిపాలెం గ్రామంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ మరియు ఎన్.హెచ్.ఎం నిధులు రూ.30.80 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ – ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్‌ను గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.   అనంతరం నూతనంగా...
    785 Views
  • తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
    కదిరి : శ్రీ సత్యసాయి జిల్లా ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భారద్వాజ్‌తో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎకో & హెరిటేజ్ వాక్, ASK AI స్కానర్ ప్రారంభం, బెలూన్ కార్యక్రమం, బొటానికల్...
    696 Views
  • భారీ వర్షాలతో పెరిగిన నీటిని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టి రైతుల పంటలకు అందించాలి – ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు
    మంగొల్లు కాలువ వద్ద అధికారులతో, రైతులతో కలిసి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు వత్సవాయి మండలం, మంగొల్లు గ్రామ పరిధిలోని డివిఆర్ బ్రాంచ్ కెనాల్ వద్ద కాలువలో ప్రవహిస్తున్న నీటిని జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు శుక్రవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రాంతంలోని పాలేరు, చెరువు...
    669 Views
  • జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సి.ఎస్. సాయి ప్రసాద్ గారిని కలిసి నియోజకవర్గ సమస్యలపై చర్చ
     శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జి. సాయి ప్రసాద్ గారిని ఈ రోజు (17-09-2026) కలిసి నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలు, ప్రధాన కార్యదర్శి గారి స్పందనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:_   1. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈనాం భూముల సమస్యను శాసనసభ్యులు గారు ప్రస్తావించగా, ఈ సమస్య...
    854 Views
  • APలో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ | AP Freehold Lands Registration Permission
    ఆంధ్రప్రదేశ్‌లో భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. AP Freehold Lands రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఫ్రీ హోల్డ్ హక్కులు పొందిన మొత్తం 7,85,500 ఎకరాల భూములకు ఈ నిర్ణయం వర్తించనుంది. భూమి యజమానులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇది కీలక మార్పుగా నిలవనుంది.
    1.3K Views
  • సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు
    విశాఖపట్నం, అక్కయ్యపాలెం ప్రాంతంలోని 'ది శ్రీ గౌరి కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్' ఆధ్వర్యంలో నిర్వహించిన 29వ వార్షిక సర్వసభ్య సమావేశంలో విశాఖపట్నం వెస్ట్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ *పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు)* గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 29 ఏళ్లుగా సహకార రంగంలో విజయవంతంగా సేవలందిస్తున్న సొసైటీ యాజమాన్యాన్ని మరియు సభ్యులను ఆయన అభినందించారు. స్థానిక ప్రజలకు ఆర్థిక భద్రతను చేకూర్చడంలో,...
    804 Views
  • మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం
    తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మరియు అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ మరియు అవగాహన కార్యక్రమాన్ని 12.09.2026 రోజున భూపాలపల్లి అటవీ కార్యాలయంలో నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా నోడల్ అధికారి మరియు ఏఎస్ డాక్టర్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జిల్లా అటవీ అధికారి శ్రీ జి. కృష్ణ గౌడ్, ఐఎఫ్ఎస్ గారి సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది.
    718 Views
More Results