జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సి.ఎస్. సాయి ప్రసాద్ గారిని కలిసి నియోజకవర్గ సమస్యలపై చర్చ

0
30

 శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జి. సాయి ప్రసాద్ గారిని ఈ రోజు (17-09-2026) కలిసి నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా చర్చించిన అంశాలు, ప్రధాన కార్యదర్శి గారి స్పందనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:_

 

1. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈనాం భూముల సమస్యను శాసనసభ్యులు గారు ప్రస్తావించగా, ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉన్నదని పేర్కొంటూ, ఒక టీంగా ఏర్పడి సంబంధిత మంత్రి గారిని కలిసి పూర్తి వివరాలతో అవగాహన కల్పించి దీనిపై సముచిత నిర్ణయం తీసుకుందామని ప్రధాన కార్యదర్శి గారు తెలిపారు.

 

2. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్నటువంటి పోలంపల్లి ప్రాజెక్టు గురించి ప్రస్తావించగా, దానిపై సానుకూలంగా స్పందించిన ప్రధాన కార్యదర్శి గారు, ఇరిగేషన్ అధికారులతో సరైన చర్యలు తీసుకుని ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అన్నారు.

 

3. జగ్గయ్యపేట పట్టణంలో ఎప్పటినుంచో ఉన్నటువంటి దుర్గాపురం ఊర చెరువు ముంపు ప్రాంతంలో ఏడబ్ల్యూడీ (AWD) ల్యాండ్ క్లాసిఫికేషన్ మార్చవలసిందిగా కోరగా, ఈ అంశాన్ని వెంటనే రెవిన్యూ అధికారులకు పంపడం జరిగింది.

 

4. ముత్యాల వద్ద హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి స్థలం కేటాయించవలసిందిగా కోరగా, సంబంధిత ఫైలును వెంటనే సిద్ధం చేయాలని కింది స్థాయి అధికారులకు ప్రధాన కార్యదర్శి గారు ఆదేశాలు జారీ చేశారు.

 

_ఈ విధంగా పలు అంశాలపై సి.ఎస్. గారిని కలవగా, వారు సానుకూలంగా స్పందించి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కింది అధికారులకు ఆదేశాలు జారీ చేశారు._

 

ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు మాట్లాడుతూ_నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించిన వెంటనే ప్రధాన కార్యదర్శి గారు కింది అధికారులకు తగిన సూచనలు చేయడం పట్ల తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు._

Search
Categories
Read More
Uttar Pradesh
COVID-19: 55-Year-Old Woman Tests Positive in Noida, Samples of Family Sent for Testing
COVID-19: 55-Year-Old Woman Tests Positive in Noida, Samples of Family Sent for Testing Noida,...
By BMA ADMIN 2025-05-24 08:57:24 0 3K
Business EDGE
Affiliations with BMA: Powering a Nation Through Media Partnerships 🤝
🤝 Affiliations with BMA: Powering a Nation Through Media Partnerships In a country as diverse...
By Business EDGE 2025-04-30 10:38:27 0 5K
BMA
Photojournalism: Telling Stories Beyond Words
Photojournalism: Telling Stories Beyond Words Photojournalism emerged as a powerful medium...
By Media Facts & History 2025-04-28 13:36:38 0 3K
Education
📢 Join us for a One-day Conference on VIKAS 2025 – Venturing into Industry Knowledge, Apprenticeship and Skilling.....
UGC announces the second “VIKAS 2025 – Venturing into Industry Knowledge,...
By Bharat Aawaz 2025-07-03 07:37:39 0 4K
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com