సికింద్రాబాద్.. ఆషాడ బోనాల ఉత్సవాలలో భాగంగా అత్తిలి అరుణ ఆధ్వర్యంలో నిర్వహించే తొలి బోనం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సనత్ నగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఆషాడంలో భాగంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనాన్ని ఆనవాయితీగా అత్తిలి అరుణ కుటుంబం సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా జోగిని శ్యామల బోనం ఎత్తుకొని చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గోల్కొండ అనంతరం ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని అందులో తొలి బోనం కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా జంట నగరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా బోనాల పండుగ విశిష్టత అందరికీ తెలియజేసేలా గొప్పగా జరిపినట్లు తెలిపారు.

0 Comments
0 Shares
216 Views
15
0 Reviews