మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.
ప్రజాసమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా జవహార్ నగర్ లో బీజేపీ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
స్థానికులు తమ సమస్యలను ఎంపీ ఈటలకు వివరించారు. ఇక్కడ ఉన్నవాళ్ళం ఎక్కువ మందిమి ఇళ్ళల్లో పనిచేసి బ్రతికే వాళ్ళం. ఇల్లు లేవు. కట్టుకున్న ఇల్లు కూడా కూలగొడుతున్నారు అంటూ మొరపెట్టుకున్నారు. దవాఖాన లేదు, కాన్పులకు కష్టం అవుతుంది. సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి నల్లా కనెక్షన్ ఇవ్వాలని కోరారు. లక్ష్మీపూర్ కాలనీకి దారి లేకుండా కబ్జా చేశారు. అంబులెన్స్ కూడా పోయే దారిలేదని, ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో పార్క్ ను నాయకులు కబ్జా చేస్తున్నారు కాపాడాలని, వీరభద్ర కాలనీలో డ్రైనేజీ లేక కాలనీ మొత్తం నిండిపోతుందని, పాపయనగర్ కాలనీ అంతా చెరువు నీళ్లతో మునుగుతుంది.. శాశ్వత పరిష్కారం ఇవ్వాలని కోరుతున్నామని విన్నవించారు.
బంజారకాలనీలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ :
40 ఏళ్ళ క్రితం పొట్టచేత పట్టుకుని వచ్చిన వారికి ఆశ్రయం కల్పించిన గడ్డ ఇది. ఉద్యమ బిడ్డగా, కరోనా సమయంలో పనిచేసిన మంత్రిగా నన్ను చూసి గొప్ప మెజారిటీతో గెలిపించారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వనిదే కట్టుకోనివ్వడం లేదు. గద్దల్లా పడుతున్నారు అని వాపోయారు. మేమంతా ఇళ్లలో పని చేసుకొని బ్రతికేవాళ్లం. మమ్ముల్ని పట్టించుకొనే వారు లేరు మీరన్న పట్టించుకోండి అంటే మేమే మీ దగ్గరికి వచ్చాం. ఇక్కడే ఉంటున్న మెదక్ జిల్లాకు చెందిన చిన్న పిల్లాన్ని కుక్కలు పీక్కతిన్నప్పుడు నేను వచ్చా. ఆరోజు వారి సమస్యలు విని చలించిపోయా. ఈ ధర్నా ప్రభుత్వానికి హెచ్చరిక. ఇది ఈ ప్రాంతం వారికోసం మాత్రమే కాదు ప్రజలందరి కోసం చేస్తున్న పోరాటం ఇది. మూర్ఖపు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపించాలి అనే ఈ ధర్నా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదలు.
దేశం నలుమూలల నుండి వచ్చిన కార్మికులు.
డంప్ యార్డ్ పక్కన ఉంటున్నారు.. కెమికల్ నీళ్లతో చచ్చిపోతామని, వాసన చూసినా జబ్బులు వస్తాయని తెలిసినా ఉంటున్నారు అంటే వీరు దిక్కులేని వారని అర్థం కావడం లేదా ? రోజా అనే ఆమె చెప్పింది 30 ఏళ్ల క్రితం వచ్చినం, 24 ఏళ్ల క్రితం భూమి కొనుక్కొని, ఇప్పుడు రేకులు వేసుకుందాం అని వేస్తే కూలగొట్టారు. ఇదేం న్యాయం అని ఆమె అడుగుతుంది. 30 గజాల్లో ఇల్లు కట్టుకొనే వారు ఉన్నోళ్ల్లా? లేనోళ్లా ? అని నేను అడుగుతున్నా. బంజారాహిల్స్ లో మీ నాయకులు కోట్ల విలువైన భూములు కబ్జా పెట్టుకుంటే GO No. 58, 59 కింద రెగ్యులరైజ్ ఎలా చేస్తారు.. ఈ పేదవాళ్ల ఇల్లు ఎలా కూలగొడతారు.. అని నేను అడుగుతున్న.
బస్తీల మీద పడి ఇల్లు కూలగొడుతున్నారు.
వారికి అండగా పక్షి లెక్క తిరుగుతున్న.
హైడ్రాను ఆహా ఓహో అన్న వాళ్లకు మూడు నెలలు అయ్యాక అర్థం అయ్యింది. వారు కూలగొట్టింది పెద్దలవి కావు పేదలవి అని. కోర్టులను కూడా గౌరవించకుండా రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తుంది. ఎవరు మీరు..పేదల మీద దౌర్జన్యం చేస్తున్నారు. జవహర్ నగర్ లో ఇల్లు ఎందుకు కొల్లగొడుతున్నారు సమాధానం చెప్పాలి. టైగర్ నరేంద్ర, దత్తాత్రేయ, బద్దం బాల్ రెడ్డిలాంటి వాళ్ళు వీళ్లకు ఈ జాగాలు ఇప్పించారు. కాంగ్రెస్ పేదల పక్షం ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లను కూలగొట్టడమా ? మీ చూపు పెద్దోళ్ళ మీదనా ? పేదోళ్ల మీదనా ? మేము మర్యాదగా చెప్పిపోతున్నాం..
అధికారులు పేదల జీవితాలతో చెలగాటమాడితే.. జాగ్రత్త. మీ పద్దు రాసి పెడుతున్నాం.. ప్రజా క్షేత్రంలో మీకు శిక్ష తప్పదు. మీకు చిత్తశుద్ధి ఉంటే కట్టుకున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వండి. మిగిలిన భూముల్లో పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వండి. కేంద్రం డబ్బులు ఇచ్చినా కేసీఆర్ కి ఇల్లు కట్టడం చేతకాలేదు.. కట్టిన ఇల్లు ఇవ్వలేదు. 20 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లను కూడా పంచలేక పోయారు. చిన్న జిల్లాలో కలెక్టర్ ప్రజలందరినీ కలుస్తారు అనుకున్నాం కానీ ఒక్కరోజు రాలేదు. కానీ పోలీసులని పట్టుకొని బుల్డోజర్లు పట్టుకుని వస్తున్నారు. 30 గజాల్లో కట్టుకున్న ఇల్లు కులగొడుతున్నారు. పేదల బస్తీలలో త్వరలో పాదయాత్ర చేస్తా. మీతో యుద్ధానికి సిద్ధం.
మీ అధికారం పోలీసుల ఏం చేస్తారో చూస్తాం.
కోటిన్నర మంది చెత్త ఒక్క డంప్ యార్డ్ లో వేస్తారా ।
సిటీకి నాలుగు దిక్కుల వేయాలి కదా..
ఈ డంప్ యార్డు తో ప్రాణాలతో చెలగాటం ఆడతార ? సిటికి దూరంగా చెత్త వేయాలని కోరుతున్నా.
డంప్ యార్డ్ నాలుగు దిక్కుల పెట్టేవరకు మేము ఆందోళన చేస్తాం. దవాఖాన లేక రోడ్డుమీద ప్రసూతి అయ్యి చచ్చిపోతున్నారు. వెంటనే ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. ప్రజలారా.. మీరు చెప్పిన సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి అన్నిటినీ పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలో.. మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సుభాష్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, బుద్ది శ్రీను, శ్రీనివాస రెడ్డి, మల్లారెడ్డి, రంగారెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి, శిల్పారెడ్డి, కార్పొరేటర్లు మహేశ్వర్ రెడ్డి, పవన్, శేషగిరి, సునీత, సురేందర్ యాదవ్, మల్లిఖార్జున్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

0 Comments
0 Shares
1K Views
0 Reviews