బాలాజీ ఎన్‌క్లేవ్‌ రోడ్లను పరిశీలించిన కార్పొరేటర్‌.

అల్వాల్ సర్కిల్‌ మచ్చబొల్లారం డివిజన్‌లోని బాలాజీ ఎన్‌క్లేవ్‌ను శనివారం కార్పొరేటర్‌ రాజ్‌ జితేంద్రనాథ్‌ సందర్శించారు. కాలనీ వాసుల సంక్షేమ సంఘం ఆహ్వానంపై, కాలనీలో సీసీ రోడ్ల అవసరాలపై వర్క్ ఇన్స్పెక్టర్‌తో కలిసి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ నం.3 తో పాటు మరో ఉప రోడ్డుకు సంబంధించిన కొలతలు తీసుకొని, అంచనాలు సిద్ధం చేశారు. ఇప్పటికే డ్రెయినేజ్, నీటి సరఫరా లైన్లు పూర్తి కావడంతో, ఆయా రోడ్లకు సీసీ రోడ్లు వేయడానికి ప్రతిపాదనలు రూపొందించి మంజూరు కోసం పంపనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా కాలనీ వాసుల బృందం కూడా పాల్గొన్నారు.
బాలాజీ ఎన్‌క్లేవ్‌ రోడ్లను పరిశీలించిన కార్పొరేటర్‌. అల్వాల్ సర్కిల్‌ మచ్చబొల్లారం డివిజన్‌లోని బాలాజీ ఎన్‌క్లేవ్‌ను శనివారం కార్పొరేటర్‌ రాజ్‌ జితేంద్రనాథ్‌ సందర్శించారు. కాలనీ వాసుల సంక్షేమ సంఘం ఆహ్వానంపై, కాలనీలో సీసీ రోడ్ల అవసరాలపై వర్క్ ఇన్స్పెక్టర్‌తో కలిసి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ నం.3 తో పాటు మరో ఉప రోడ్డుకు సంబంధించిన కొలతలు తీసుకొని, అంచనాలు సిద్ధం చేశారు. ఇప్పటికే డ్రెయినేజ్, నీటి సరఫరా లైన్లు పూర్తి కావడంతో, ఆయా రోడ్లకు సీసీ రోడ్లు వేయడానికి ప్రతిపాదనలు రూపొందించి మంజూరు కోసం పంపనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా కాలనీ వాసుల బృందం కూడా పాల్గొన్నారు.
0 Comments 0 Shares 291 Views 0 Reviews
BMA (Bharat Media Association) | By IINNSIDE https://bma.bharatmediaassociation.com