జూబ్లీ బస్ స్టేషన్ ను మోడల్ బస్ స్టేషన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బుధవారం జూబ్లీ బస్ స్టేషన్ డిపో, కంటోన్మెంట్ బస్ డిపో లలో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డిపో అధికారులు, ట్రాఫిక్ పోలీసు అధికారులు ,పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా బస్ స్టేషన్ లోకి వచ్చే బస్సులు మెయిన్ గేటు లో ఆపి ప్రయాణికులను దించడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతుందని, కంటోన్మెంట్ బోర్డు వారి స్థలాన్ని...