భారీ వర్షాలతో పెరిగిన నీటిని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టి రైతుల పంటలకు అందించాలి – ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు

0
101

మంగొల్లు కాలువ వద్ద అధికారులతో, రైతులతో కలిసి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు

వత్సవాయి మండలం, మంగొల్లు గ్రామ పరిధిలోని డివిఆర్ బ్రాంచ్ కెనాల్ వద్ద కాలువలో ప్రవహిస్తున్న నీటిని జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు శుక్రవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రాంతంలోని పాలేరు, చెరువు మాధవరం ట్యాంకులు నిండి, వాటి ఎక్సెస్ వాటర్ డివిఆర్ బ్రాంచ్ కెనాల్‌కు చేరుతున్న నేపథ్యంలో కాలువ ద్వారా వస్తున్న నీటిని రైతులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు._

_ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య గారు కాలువ వద్దకు చేరుకుని కాలువలో ప్రవహిస్తున్న నీటి పరిస్థితిని అధికారులతో, రైతులతో, రైతు సంఘం నాయకులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. నీటి ప్రవాహం ఎంతమేరకు వస్తోంది, కాలువ ద్వారా ఎన్ని ప్రాంతాలకు సాగునీరు అందే అవకాశం ఉంది, పంట చెరువులను నింపేందుకు అవసరమైన చర్యలు ఏమిటనే అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు._

భారీ వర్షాల కారణంగా పాలేరు మరియు చెరువు మాధవరం ట్యాంకులు నిండటంతో ప్రస్తుతం వస్తున్న అదనపు నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కాకుండా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. డివిఆర్ బ్రాంచ్ కెనాల్‌కు వస్తున్న నీటిని రైతులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు._

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ*, _ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన నీటిని రైతుల సాగునీటి అవసరాలకు వినియోగించుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. కాలువ ద్వారా వస్తున్న నీటిని ముందుగా పంట చెరువులను నింపుకునే విధంగా రైతులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. పంటలకు అవసరమైన సమయంలో నీరు అందుబాటులో ఉండేలా నీటి వినియోగంపై రైతులతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు._

కాలువలో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఎక్కడైనా నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడితే వెంటనే వాటిని తొలగించే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాలువ కట్టలు, నీటి మళ్లింపు ప్రాంతాలు, అవసరమైన చోట్ల నీటి ప్రవాహాన్ని నియంత్రించే వ్యవస్థలను పరిశీలించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు._

కాలువ వద్ద ఉన్న రైతులతో ఎమ్మెల్యే తాతయ్య గారు నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కాలువలో వస్తున్న నీటిని ఏ విధంగా వినియోగించుకోవాలి, పంట చెరువులను ఎలా నింపుకోవాలి, ఏ ప్రాంతాలకు ఎంతమేర నీరు అవసరమనే అంశాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.రైతు సంఘం నాయకులతో కూడా ఎమ్మెల్యే గారు చర్చించి, నీటి పంపిణీలో రైతుల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని సూచించారు.అందుబాటులో ఉన్న నీటిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకునేలా పరస్పర సహకారంతో ముందుకు సాగాలని కోరారు._

డివిఆర్ బ్రాంచ్ కెనాల్‌కు వస్తున్న ఎక్సెస్ వాటర్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నీటి ప్రవాహాన్ని నిరంతరం గమనిస్తూ, రైతులకు అవసరమైన సమాచారం అందించాలని తెలిపారు. పంటలకు సాగునీటి అవసరాలు ఉన్న సమయంలో ఈ నీరు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఒక్క నీటి బొట్టును కూడా వృథా కాకుండా రైతుల ప్రయోజనాలకు వినియోగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.ప్రస్తుతం కాలువలోకి వస్తున్న నీటిని చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. భారీ వర్షాల ద్వారా లభించిన అదనపు నీటిని పంట చెరువుల్లోకి మళ్లించుకుని భవిష్యత్ సాగునీటి అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం కల్పించేందుకు ఎమ్మెల్యే తాతయ్య గారు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు._

ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ లు కట్టా వెంకట నరసింహారావు, యానాల గోపీచంద్, DC కెనాల్ వైస్ చైర్మన్ మన్నె నారాయణరావు, బొల్లం పురుషోత్తం, రైతు సంఘం నాయకులు కర్ల నాగేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శీలం నాగయ్య, షేక్ ఖాదర్ బాబు సంబంధిత అధికారులు, రైతులు, రైతు సంఘం నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు._

Search
Categories
Read More
Media Academy
The Noble Profession Of Journalism: A Career For The Curious And Committed
The Noble Profession Of Journalism: A Career For The Curious And Committed Becoming A Journalist...
By Media Academy 2025-04-28 19:08:32 0 5K
BMA
Income Sources at Bharat Media Association (BMA)
At Bharat Media Association, We Believe That Supporting Media Professionals Goes Beyond Just...
By BMA (Bharat Media Association) 2025-04-27 12:37:41 0 4K
Kerala
Kerala: Wife allegedly murdered husband in Kannur's Kaithapram village
Kannur Murder Case: Auto Driver’s Wife Arrested for Allegedly Orchestrating Husband’s...
By BMA ADMIN 2025-05-20 05:14:04 0 2K
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com