నిజం చెప్పినందుకే శిక్షా? జార్ఖండ్ జర్నలిస్టుపై వరుస కేసులు
జార్ఖండ్ జర్నలిస్టు రుపేష్ కుమార్ సింగ్ వరుస FIRలు, యూఏపీఏ కేసులతో మూడు సంవత్సరాలుగా జైలులోనే కొనసాగుతున్నాడు. ఆదివాసీ సమస్యలు, పారిశ్రామిక కాలుష్యం, ప్రజల హక్కులపై నిరంతరం రిపోర్టింగ్ చేసినందుకే అతనిని టార్గెట్ చేశారని కుటుంబం, ప్రెస్ వర్గాలు అంటున్నాయి. అతని రిపోర్ట్‌ల వల్ల అసౌకర్యానికి గురైన అధికారులు కేసులు పెంచారని ఆరోపణలు ఉన్నాయి. రుపేష్‌ను దూర ప్రాంత జైళ్లకు బదిలీ చేయడం, బెయిల్...