శ్రీ. శ్రీధర్ బాబు గారికి గౌరవనీయులు మంత్రి గారు, ఐటీ మరియు కమ్యూనికేషన్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్

విషయం: మీసేవ సేవల విస్తరణలో CSCల పాత్రపై పునఃపరిశీలన చేయవలసిన అవసరం - ప్రజల పక్షాన వినమ్ర విన్నపం.

గౌరవనీయులారా, మీ సేవలను ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా చేరవేయాలనే దృక్కోణంలో ఇటీవల మీసేవ కమిషనర్ గారికి CSCల ఒప్పందాన్ని రద్దు చేయమని ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్రవ్యాప్తంగా CSC వీసీఎల్‌లు, గ్రామీణ ప్రజలలో ఆందోళన నెలకొంది.

సత్యాన్ని తెలియజేయడమే లక్ష్యంగా, CSCలు ప్రైవేట్ సంస్థలు కాదు. ఇవి భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా MeitY పర్యవేక్షణలో పనిచేస్తున్న ప్రభుత్వ అనుబంధ సంస్థలు (SPV) మాత్రమే.

కేంద్ర ప్రభుత్వం నేరుగా CSCల నిర్వహణను పర్యవేక్షిస్తోంది.

దేశవ్యాప్తంగా కోట్లాది పౌరులకు సర్వీసులను అందిస్తూ రుజువైన వేదికలు.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ సేవలను విజయవంతంగా అందిస్తున్నాయి.


“ప్రైవేటీకరణ” అనే వాదన తప్పు CSCల ద్వారా మీసేవ సేవల విస్తరణ ప్రైవేటీకరణ కాదు, ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించడమే లక్ష్యం.

తెలంగాణలో పరిస్థితి: ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఒక్క రాష్ట్ర ప్రభుత్వ సేవ కూడా CSCల ద్వారా అందించకపోవడం బాధాకరం. మా విన్నపం ఏమంటే:

CSCలను మీసేవకు సహాయక భాగస్వామిగా గుర్తించి

గ్రామీణ ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించాలి

ఆదాయ మార్గాలు పెరిగి, ప్రభుత్వ ఆదాయంలోనూ పెరుగుదల ఉంటుంది

సర్కార్ విధానాలకు ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుంది


మా వినమ్ర అభ్యర్థన: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, గ్రామీణ ప్రాంతాల్లో మీసేవ CSCల ద్వారా సేవల విస్తరణకు ప్రభుత్వం పునఃసమీక్ష చేయవలసిన అవసరం ఉంది. మీసేవ కమిషనర్ గారికి ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుని, మీ శాఖ నేతృత్వంలో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించే నిర్ణయం తీసుకోవాలని మనవి.

20000కు పైగా CSC కుటుంబాల తరుపున, మీకు గౌరవపూర్వక విన్నపం. ప్రభుత్వ స్పందన లేకపోతే దిశల వారీగా గ్రామాల్లో మా కుటుంబాలతో సహా మా హక్కుల కోసం శాంతియుతంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము.

మీ ఆశీర్వాదంతో తెలంగాణ డిజిటల్ ప్రగతిలో భాగమవుదామని ఆకాంక్షిస్తూ..

విన్నపదారులు తెలంగాణ రాష్ట్ర CSC వీసీఎల్ సంఘం.
శ్రీ. శ్రీధర్ బాబు గారికి గౌరవనీయులు మంత్రి గారు, ఐటీ మరియు కమ్యూనికేషన్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ విషయం: మీసేవ సేవల విస్తరణలో CSCల పాత్రపై పునఃపరిశీలన చేయవలసిన అవసరం - ప్రజల పక్షాన వినమ్ర విన్నపం. గౌరవనీయులారా, మీ సేవలను ప్రజలకు మరింత వేగంగా, సమర్థవంతంగా చేరవేయాలనే దృక్కోణంలో ఇటీవల మీసేవ కమిషనర్ గారికి CSCల ఒప్పందాన్ని రద్దు చేయమని ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్రవ్యాప్తంగా CSC వీసీఎల్‌లు, గ్రామీణ ప్రజలలో ఆందోళన నెలకొంది. సత్యాన్ని తెలియజేయడమే లక్ష్యంగా, CSCలు ప్రైవేట్ సంస్థలు కాదు. ఇవి భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా MeitY పర్యవేక్షణలో పనిచేస్తున్న ప్రభుత్వ అనుబంధ సంస్థలు (SPV) మాత్రమే. కేంద్ర ప్రభుత్వం నేరుగా CSCల నిర్వహణను పర్యవేక్షిస్తోంది. దేశవ్యాప్తంగా కోట్లాది పౌరులకు సర్వీసులను అందిస్తూ రుజువైన వేదికలు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ సేవలను విజయవంతంగా అందిస్తున్నాయి. ❌ “ప్రైవేటీకరణ” అనే వాదన తప్పు CSCల ద్వారా మీసేవ సేవల విస్తరణ ప్రైవేటీకరణ కాదు, ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించడమే లక్ష్యం. తెలంగాణలో పరిస్థితి: ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఒక్క రాష్ట్ర ప్రభుత్వ సేవ కూడా CSCల ద్వారా అందించకపోవడం బాధాకరం. మా విన్నపం ఏమంటే: CSCలను మీసేవకు సహాయక భాగస్వామిగా గుర్తించి గ్రామీణ ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించాలి ఆదాయ మార్గాలు పెరిగి, ప్రభుత్వ ఆదాయంలోనూ పెరుగుదల ఉంటుంది సర్కార్ విధానాలకు ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుంది 📌 మా వినమ్ర అభ్యర్థన: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, గ్రామీణ ప్రాంతాల్లో మీసేవ CSCల ద్వారా సేవల విస్తరణకు ప్రభుత్వం పునఃసమీక్ష చేయవలసిన అవసరం ఉంది. మీసేవ కమిషనర్ గారికి ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుని, మీ శాఖ నేతృత్వంలో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించే నిర్ణయం తీసుకోవాలని మనవి. 20000కు పైగా CSC కుటుంబాల తరుపున, మీకు గౌరవపూర్వక విన్నపం. ప్రభుత్వ స్పందన లేకపోతే దిశల వారీగా గ్రామాల్లో మా కుటుంబాలతో సహా మా హక్కుల కోసం శాంతియుతంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. మీ ఆశీర్వాదంతో తెలంగాణ డిజిటల్ ప్రగతిలో భాగమవుదామని ఆకాంక్షిస్తూ.. విన్నపదారులు తెలంగాణ రాష్ట్ర CSC వీసీఎల్ సంఘం.
0 Comments 1 Shares 550 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com