రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి గార్లు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా లో ఉన్న PSR గార్డెన్ లో జిల్లా మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన సంగారెడ్డి నియోజక వర్గ స్థాయి మహిళా సమాఖ్య అద్వర్యం లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు - 2025 లలో పాల్గొన్నారు .

ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ...
ఇందిరా మహిళా శక్తి సంబరాలను సంగారెడ్డి జిల్లాలో అధికారకంగా పండుగ వాతావరణంలో వేడుక గా జరుపుకుంటున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. స్వయం సహాయక బృందాల చరిత్ర 2000 లో మొదలైందన్నారు . స్వయం సహకార సంఘాలు అనే ఒక ఆలోచన 25 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమము మొదలుపెడితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు . గ్రామీణ మహిళలు పొదుపు ను సంఘాల ద్వారా పొదుపు చేసుకోవాలన్నారు , ఆర్థికంగా ఎదగాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించటం జరిగిందన్నారు . దానికి బ్యాంకు తో సహా ఆనాటి ప్రభుత్వాలు రివాల్వింగ్ ఇచ్చారన్నారు . మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం లో పావులా వడ్డీ , అభయ హస్తం పతకాల ద్వారా మహిళలను , మహిళా సమాఖ్య లను ఆర్థికంగా బలోపేతం చేశామన్నారు . కానీ గత BRS ప్రభుత్వం లో మహిళా సమాఖ్య ల పై వివక్ష చూపారన్నారు మంత్రి దామోదర్ నరసింహ .

ప్రజా ప్రభుత్వం ఏర్పడినా తరువాత సీఎం రేవంత్ రెడ్డి అద్వర్యం లో మహిళా సమాఖ్య లకు పూర్వ వైభవాన్ని తెచ్చామన్నారు. సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యం లో చేపట్టిన సంక్షేమం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ . రాష్ట్రం లో మహిళా సమాఖ్య ద్వారా పెట్రోల్ pump, షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్వహణ , canteen నిర్వహణ లను జిల్లా మహిళా సమాఖ్య నిర్వహిస్తోందన్నారు . గతం లో sc కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు జిల్లాలో రెండు ప్రాంతాల్లో 5ఎకరాల చొప్పున 10 ఎకరాల ప్రభత్వ భూమి ని కేటాయించామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ . మహిళలను పరాశక్తి గా అభివర్ణించారు . కూతురు గా , చెల్లి గా , అమ్మగా . భార్య గా ఒక మహిళా తన కుటుంబాన్ని బాధ్యతతో , క్రమశిక్షణ తో ముందుకు తీసుకెళ్తుందన్నారు . మహిళా సంక్షేమం , సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. మహిళలు ఇంకా ముందుకు రావాలని ఆకాక్షించారు , జిల్లాలో జాతీయ రహదారుల వెంట ఉన్న ఒకటి , రెండు ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే మహిళా సమాఖ్య కు కేటాయించాలన్నారు . మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాలన్నారు . కోటి మంది మహిళలను కోటేశ్వర్లు గా తీర్చి దిద్దుతున్నామన్నారు . ఒక్కసారి మనం ఆలోచన చెసు కోవాలన్నారు. మీకు ఎన్నిసార్లు వడ్డీ లేని రుణాలు సమయానికి గత ప్రభుత్వం ఇచ్చిందో ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయాలన్నారు.

ఈ కార్యక్రమం లో శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి , నారాయణ ఖేడ్ ఏమ్మెల్యే డా . సంజీవ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ వివిధ సంస్థల చైర్మన్ లు నిర్మల జగ్గారెడ్డి , ఫయీమ్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య లు పాల్గొన్నారు .
రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి గార్లు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా లో ఉన్న PSR గార్డెన్ లో జిల్లా మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన సంగారెడ్డి నియోజక వర్గ స్థాయి మహిళా సమాఖ్య అద్వర్యం లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు - 2025 లలో పాల్గొన్నారు . ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ... ఇందిరా మహిళా శక్తి సంబరాలను సంగారెడ్డి జిల్లాలో అధికారకంగా పండుగ వాతావరణంలో వేడుక గా జరుపుకుంటున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. స్వయం సహాయక బృందాల చరిత్ర 2000 లో మొదలైందన్నారు . స్వయం సహకార సంఘాలు అనే ఒక ఆలోచన 25 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమము మొదలుపెడితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు . గ్రామీణ మహిళలు పొదుపు ను సంఘాల ద్వారా పొదుపు చేసుకోవాలన్నారు , ఆర్థికంగా ఎదగాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించటం జరిగిందన్నారు . దానికి బ్యాంకు తో సహా ఆనాటి ప్రభుత్వాలు రివాల్వింగ్ ఇచ్చారన్నారు . మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం లో పావులా వడ్డీ , అభయ హస్తం పతకాల ద్వారా మహిళలను , మహిళా సమాఖ్య లను ఆర్థికంగా బలోపేతం చేశామన్నారు . కానీ గత BRS ప్రభుత్వం లో మహిళా సమాఖ్య ల పై వివక్ష చూపారన్నారు మంత్రి దామోదర్ నరసింహ . ప్రజా ప్రభుత్వం ఏర్పడినా తరువాత సీఎం రేవంత్ రెడ్డి అద్వర్యం లో మహిళా సమాఖ్య లకు పూర్వ వైభవాన్ని తెచ్చామన్నారు. సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యం లో చేపట్టిన సంక్షేమం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ . రాష్ట్రం లో మహిళా సమాఖ్య ద్వారా పెట్రోల్ pump, షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్వహణ , canteen నిర్వహణ లను జిల్లా మహిళా సమాఖ్య నిర్వహిస్తోందన్నారు . గతం లో sc కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు జిల్లాలో రెండు ప్రాంతాల్లో 5ఎకరాల చొప్పున 10 ఎకరాల ప్రభత్వ భూమి ని కేటాయించామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ . మహిళలను పరాశక్తి గా అభివర్ణించారు . కూతురు గా , చెల్లి గా , అమ్మగా . భార్య గా ఒక మహిళా తన కుటుంబాన్ని బాధ్యతతో , క్రమశిక్షణ తో ముందుకు తీసుకెళ్తుందన్నారు . మహిళా సంక్షేమం , సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. మహిళలు ఇంకా ముందుకు రావాలని ఆకాక్షించారు , జిల్లాలో జాతీయ రహదారుల వెంట ఉన్న ఒకటి , రెండు ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే మహిళా సమాఖ్య కు కేటాయించాలన్నారు . మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాలన్నారు . కోటి మంది మహిళలను కోటేశ్వర్లు గా తీర్చి దిద్దుతున్నామన్నారు . ఒక్కసారి మనం ఆలోచన చెసు కోవాలన్నారు. మీకు ఎన్నిసార్లు వడ్డీ లేని రుణాలు సమయానికి గత ప్రభుత్వం ఇచ్చిందో ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచన చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి , నారాయణ ఖేడ్ ఏమ్మెల్యే డా . సంజీవ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ వివిధ సంస్థల చైర్మన్ లు నిర్మల జగ్గారెడ్డి , ఫయీమ్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య లు పాల్గొన్నారు .
0 Comments 0 Shares 246 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com