BMA | Bharat Media Association
ఉదయగిరి నియోజకవర్గంలో కూటమి జెండా ఎగరడం ఖాయం.. గెలుపుపై ఎలాంటి సందేహం లేదు..!!

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు పిలుపునిచ్చారు.

ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని 83 ఎంపీటీసీ స్థానాలు, 8 జడ్పీటీసీ స్థానాలు, 143 గ్రామ పంచాయతీల్లో కూటమి ఘన విజయం సాధించబోతోందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులు, నాయకులు మరియు కార్యకర్తల ఐక్యత, సమష్టి కృషితో ప్రతి పంచాయతీ, ప్రతి వార్డు, ప్రతి స్థానంలో కూటమి జెండా ఎగరడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, ప్రజలే తమ ఓటు ద్వారా విజేతలను నిర్ణయిస్తారని పేర్కొన్నారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని, అవసరమైన చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ.. ప్రజల విశ్వాసంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు స్పష్టం చేశారు.
55 Views